- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను ఎఫెక్ట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
మొంథా తుపాను విశాఖకు 600 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది....

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Storm) విశాఖ(Visakha)కు 600 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో తెలుగు రాష్ట్రాల(Telugu States)పై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) హెచ్చరించారు. ఏపీ(Ap)లో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్(High Allert) ప్రకటించింది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిబ్బంది సిద్ధమైంది. రైల్వే ట్రాక్ వెంట పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ డివిజన్ (Vijayawada Division)అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ(South Central Railway General Manager Sanjay Kumar Srivastava) ఆదేశించారు.
Read More: మొంథా సైక్లోన్ ఎఫెక్ట్.. 43 రైళ్ల రద్దు






