మొంథా తుపాన్‌ ఉగ్ర రూపం.. కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ

by Malleboina Mahesh |

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది.

మొంథా తుపాన్‌ ఉగ్ర రూపం.. కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మొంథా తుపాన్ ఉధృతి భారీగా పెరుగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, తుపాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది.

ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుపాన్ దగ్గరకు వస్తున్న కొద్ది.. తీవ్రత తారా స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటి సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. దీనికి తోడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన అధికారులు కాకినాడ పోర్టుకు 10వ నంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు తీరప్రాంతాల్లో సిద్ధంగా ఉంచబడ్డాయి.

Next Story