Senyar Update: రేపు బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల్లో తుపాన్

by Naga Rani Yarlagadda |

మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో..

Senyar Update: రేపు బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల్లో తుపాన్
X

దిశ, వెబ్‌డెస్క్: మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా మారుతుందని అంచనా వేసింది. ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సూచించిన సెన్యార్ అనే పేరును ఖరారు చేయనున్నారు. అరబిక్ లో సెన్యార్ అంటే సింహం అని అర్థం. ఈ తుపానుకు ప్రభావితం కానున్న ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్ తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ తుపాను గమనం ఎటువైపు ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

కాగా.. తుపాను ప్రభావంతో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నవంబర్ 27 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రేపు ఏపీలో వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది.

Next Story