తెనాలి పోలీసుల అదుపులో న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వాహకుడు

by Naga Rani Yarlagadda |

'స్ట్రిప్ టాక్' పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వహిస్తున్న యువకుడిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెనాలి పోలీసుల అదుపులో న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వాహకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అశ్లీల వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టును తెనాలి పోలీసులు రట్టు చేశారు. 'స్ట్రిప్ టాక్' పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వహిస్తున్న ఒక యువకుడిని త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించి, దాని ద్వారా అశ్లీల చాటింగ్‌కు తెరలేపాడు. డబ్బులు చెల్లించిన కస్టమర్లతో మహిళలు న్యూడ్ చాటింగ్ చేసేలా ప్లాన్ చేశాడు. ఇందుకు ప్రతిఫలంగా సదరు మహిళలకు ఒక్కో సెషన్‌కు రూ.500 నుండి రూ.1,000 వరకు నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

బంధువులనే పావులుగా వాడి..

పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఒక విస్తుపోయే నిజాన్ని వెల్లడించాడు. ఆ పోర్టల్‌లో తన బంధువులైన ఇద్దరు మహిళలు తప్ప వేరే ఎవరూ లేరని అతడు వాదించాడు. అయితే.. నిందితుడు కేవలం సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తున్నాడా లేక దీని వెనుక పెద్ద ముఠా ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వాదనలో వాస్తవమెంత అన్నది తేల్చడానికి పోలీసులు ఫోన్ డేటా, పోర్టల్ లాగ్స్ వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో తెనాలి త్రీ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, సమాజంపై దీని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ ఆన్‌లైన్ అశ్లీల దందా ఎప్పటి నుండి సాగుతోంది? బాధితులు ఎవరు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

Next Story