శ్రీశైలంలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏసీ గదుల పేరుతో 27 మందికి టోకరా

by Vemula.Srinu Prasad |

శ్రీశైల క్షేత్రంలో భక్తులఅవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఢిల్లీకి చెందిన యాత్రికులు వీరి ఉచ్చులో పడి వేల రూపాయలు నష్టపోయారు.

శ్రీశైలంలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..   ఏసీ గదుల పేరుతో 27 మందికి టోకరా
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైల క్షేత్రం(Srisailam Temple)లో భక్తుల(Devotees) అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఢిల్లీ(Delhi)కి చెందిన యాత్రికులు వీరి ఉచ్చులో పడి వేల రూపాయలు నష్టపోయారు. ఆన్‌లైన్‌లో 'మల్లికార్జున సదన్' పేరుతో నకిలీ వెబ్‌సైట్ లేదా ప్రకటనలను సృష్టించిన కేటుగాళ్లు, గదులు బుక్ చేస్తామంటూ భక్తులను నమ్మించి నగదు కాజేశారు.

హైదరాబాద్ నుంచి టూరిస్ట్ బస్సులో శ్రీశైలం చేరుకున్న 27 మంది ఢిల్లీ యాత్రికుల బృందం, ముందస్తుగా 9 ఏసీ గదుల కోసం సైబర్ మోసగాళ్లకు రూ. 15,000 చెల్లించారు. తీరా క్షేత్రానికి చేరుకుని మల్లికార్జున సదన్ అధికారులను సంప్రదించగా, తమ పేరిట ఎలాంటి బుకింగ్స్ లేవని తేలడంతో భక్తులు అవాక్కయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు.

పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు వసతి గదుల కోసం కేవలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు, సోషల్ మీడియాలో కనిపించే అనధికారిక ఫోన్ నంబర్లను నమ్మి నగదు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story