- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనులు వేగంగా జరిగేలా చూడండి.. పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం
పోలవరం (Polavaram Dam) ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం (Polavaram Dam) ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) (Central Water Commission) బృందం సందర్శించింది. జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్‌ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్ట్‌ను సందర్శించింది. పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ, దిగువ కాఫర్ డామ్, స్పిల్ వేలను బృందం పరిశీలించింది. బట్రస్ డామ్, డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జలవరుల శాఖ అధికారులు వివరించారు. ఈ బృందం వెంట పోలవరం ఈఎన్సీకే నరసింహమూర్తి, ఈఈలు డీ శ్రీనివాస్, కే బాలకృష్ణ, డీఈలు అనిల్ కుమార్, శ్రీరాం పటేల్,మల్లికార్జున్, ఏఈఈలు అనిల్ కుమార్, పద్మ కుమార్, సురేష్, అరుణ్, కుమారస్వామి, పోలవరం ప్రాజెక్టు ఎంఈఐఎల్‌జీఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి , పాండే, వెంకటేశ్ ఉన్నారు. కాగా, పోలవరం ఎడమ కాలువ పనులను వేగంగా చేసి అనకాపల్లి జిల్లాలో ఆయకట్టుకు గోదావరి వరద జలాలు ఈ సీజన్‌లోనే మళ్లించాలనే లక్ష్యంతో ఒకవైపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్రకు, అటు రాయలసీమకు ఈ ఏడాదిలోనే ప్రయోజనాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు.






