- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కస్టడీ: పోలీసులకు సహకరించని అనంతబాబు..?
దళిత యువకుడు, తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ సమయంలో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని పోలీసు వర్గాల సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత యువకుడు, తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ సమయంలో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని పోలీసు వర్గాల సమాచారం. సాక్షులను ప్రభావితం చేసిన వ్యవహారంపై పోలీసులు సుమారు 50 ప్రశ్నలు అడగగా, ఆయన వేటికీ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. సాక్షులను బెదిరించిన రౌడీ షీటర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు.
నేడు కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ
ఇవాళ (బుధవారం) ఉదయం జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి జిల్లా కోర్టులో నేడు ఈ కేసుకు సంబంధించి మూడు కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు వేసిన పిటిషన్, సాక్షులను ప్రభావితం చేసిన వ్యవహారంలో (సర్పవరం పీఎస్ పరిధిలో నమోదైన కేసు) తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్, ఇదే కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న న్యాయవాది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.






