- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రంగమే అత్యంత కీలకం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రంగమే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రంగమే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన విశాఖ నోవాటెల్ వేదికగా జరుగుతోన్న ఇండియా-యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ఫెబీ ప్రతినిధులతో సహా సమావేశానికి హాజరైన నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటరాక్షన్ సెషన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సుస్థిరాభివృద్ధిలో భారత్, యూరోప్ మరింత సమర్థంగా కలసి పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా భూతాపం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. క్లౌడ్ బరస్ట్ లాంటి ప్రకృతి విపత్తులతో నగరాలు నీట మునిగే పరిస్థితి ఉత్పన్నమవుతోందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒకేచోట 40 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు వచ్చాయన్నారు. అందుకే మనం అంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు ముందడుగు వేయాలన్నారు. భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కవుట్ చేస్తోందని అన్నారు. త్వరలోనే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారవుతుందని.. రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వస్తున్న డేటా సెంటర్లకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేస్తామని అన్నారు.
45 రోజుల్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే..
టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. విశ్వ వ్యాప్తంగా ఐటీ ఫీల్డ్‌లో ఎక్కడి వెళ్లినా భారతీయులే లీడ్ చేస్తున్నారని తెలిపారు. ఇక అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుందని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఎంఎన్‌సీ కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని అన్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏపీ ముందు ఉందని, భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామని. రాష్ట్రంలోని అన్ని పోర్టులను రైల్వే లైన్లకు లింక్ చేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఏపీలో యువత టెక్నికల్ స్కిల్స్‌కు కొదవ లేదని కితాబిచ్చారు. కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేసే వారికి ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం నుంచి వారికి భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఏపీలో ప్రపంచంలోని అన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టవచ్చని.. 45 రోజుల్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.






