సహజీవనంలో విషాదం.. ఏఎస్ఐని చంపి లొంగిపోయిన ప్రియుడు

by Naga Rani Yarlagadda |

ప్రియురాలిని చంపి.. ఆపై ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయాడు ప్రియుడు. ఈఘటన గుజరాత్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సహజీవనంలో విషాదం.. ఏఎస్ఐని చంపి లొంగిపోయిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలిని చంపి.. ఆపై ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయాడు ప్రియుడు. ఈఘటన గుజరాత్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణమైన హత్య కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కానిస్టేబుల్ అయిన దిలీప్ డాంగ్చియా తన సహజీవన భాగస్వామి, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) అరుణాబెన్ నతుభాయ్ జాదవ్‌ను హత్య చేసి, ఆమె పనిచేసే అంజార్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దిలీప్ - అరుణాబెన్‌లకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తూ, త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అరుణాబెన్ (25) అంజార్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా, దిలీప్ మణిపుర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. స్థానికుల ప్రకారం.. ఈ జంట మధ్య గత కొంతకాలంగా తరచూ విభేదాలు ఉండేవి. శుక్రవారం రాత్రి కూడా వారి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో అరుణాబెన్, దిలీప్ తల్లిని దూషిస్తూ మాట్లాడడంతో.. ఆగ్రహానికి గురైన దిలీప్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. హత్య తర్వాత.. శనివారం ఉదయం అంజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Next Story