తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-30 09:27:37  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ తరుణంలో నేడు(గురువారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం కేవలం 2 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉణ్నారు. తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 64,048 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,838 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.0 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

READ MORE .....

ఏపీలో 5 వేల దేవాల‌యాలు..టీటీడీ భారీ ప్లాన్ !

Next Story