- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ .. 20 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేయిటింగ్
వరుస సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: వరుస సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో.. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే మొత్తం 82,007 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుల వివరాలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. నిన్న స్వామివారికి మొత్తం 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లుగా నమోదైంది. సాధారణంగా సెలవు దినాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, భక్తులు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉంటే తిరుమల కొండల అందాలు భక్తులను పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే మంచు పొరల్లో ఏడుకొండల అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
- Tags
- Tirumala






