TTD News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

TTD News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) తిరుమలలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి NG షెడ్స్ వరకు వేచి ఉన్నారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story