- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
by Malleboina Mahesh |
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, నిన్న ఒక్కరోజే స్వామివారిని 66,389 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 24,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.81 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
- Tags
- Tirumala
Next Story






