Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-19 04:04:33  IST  )

తిరుమలలో భక్తుల రద్దీ (Tirumala Rush)కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ (Tirumala Rush)కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది. నిన్న (ఆదివారం) స్వామివారిని 84,571 మంది భక్తులు దర్శించుకోగా.. 33,372 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు తెలిపింది.

కాగా.. ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత, ఇతర ఆన్లైన్ టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఉదయం ఎలక్ట్రానిక్ డిప్ తీయనున్నట్లు వెల్లడించింది. మే 21న ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఇచ్చింది. 22న ఉదయం 10 గంటలకు టీటీడీ మరిన్ని టికెట్లను విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను విడుదల చేయనుంది.

మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా.. మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేటి ఆర్జిత సేవలు, అభిషేకాలను నిలిపివేశారు.

Next Story