నీట మునిగిన పంట పొలాలు

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి..

నీట మునిగిన పంట పొలాలు
X

దిశ, సీతానగరం: నల్లగొండ, రఘుదేవపురం గ్రామాలకు చెందిన సుమారు 100 ఎకరాలు వరిపొలాలు నీటి మునిగాయి. రెండురోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎగువ నుంచి కొండ గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పంట చేలకు ముంపు నీరు పెరిగింది. వరి దుబ్బు ఏర్పడే సమయంలో ఇలా పంట నీటిలో మునిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ముంపు నీరు కొనసాగితే వరిపొలాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story