- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ నోట్ల గుట్టురట్టు.. ఐదుగురు కేటుగాళ్ల అరెస్ట్
by Vemula.Srinu Prasad |
కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ నోట్ల ముద్రణ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ.500 విలువైన దొంగనోట్లను ముద్రిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District) అమలాపురం(Amalapuram)లో నకిలీ నోట్ల(Fake Notes) ముద్రణ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ.500 విలువైన దొంగనోట్లను ముద్రిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీతో పాటు, ముద్రణకు ఉపయోగించి కలర్ ప్రింటర్లు, స్కానర్లు, పేపర్లతో పాటు ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? ఇప్పటికే ఎంత మొత్తంలో నకిలీ నోట్లను మార్కెట్లోకి వదిలారు? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. కరెన్సీ మార్పిడి సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Next Story






