- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌లు శ్రీవారి సేవలో తరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌లు శ్రీవారి సేవలో తరించారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్ పటేల్‌తో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఒకానొక టీటీడీ సిబ్బంది క్రికెటర్లతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఇకపోతే గాయాల కారణంగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌లు ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నారు. గతేడాది రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. రిషబ్ పంత్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉండగా అక్షర్ పటేల్ ఇటీవలే వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యారు. అనంతరం అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. జట్టులో చోటు దక్కేలా ఇరువురు శ్రీవారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
- Tags
- tirumala






