- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి లోకేష్‌కు క్రికెటర్ తిలక్ వర్మ గిఫ్ట్
ఆసియా కప్ ఫైనల్(Asia Cup Final)లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విసయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్(Asia Cup Final)లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విసయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Cricketer Tilak Varma) అదరగొట్టాడు. అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)కు తిలక్ వర్మ గిఫ్ట్ ఇచ్చారు. తాను మ్యాచ్‌లో ఉపయోగించిన క్యాప్‌ను లోకేష్‌కు బహుమతిగా ఇస్తున్నట్లు తిలక్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ రివీల్ చేశారు. మరోవైపు తిలక్ వర్మ గిఫ్ట్‌కు లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్ తీసుకుంటా’’ అని లోకేష్ పేర్కొన్నారు. క్యాప్‌పై తిలక్ వర్మ సంతకం చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా లోకేశ్ షేర్ చేశారు. ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వీడియో






