Ambati Rayudu : వాలంటీర్ వ్యవస్థపై క్రికెటర్ రాయుడు సంచలన వ్యాఖ్యలు

by Javid Pasha |   (  Updated:2023-07-11 11:28:54  IST  )

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Ambati Rayudu : వాలంటీర్ వ్యవస్థపై క్రికెటర్ రాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,డైనమిక్ బ్యూరో : వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. మంచి పనులు చేస్తున్న వ్యవస్థపై ఎవరో ఒకరు బురద చల్లడం సహజమేనని.. అలాంటివాటిని పట్టించుకోకుండా నిర్భయంగా ముందుకు వెళ్లాలని అంబటి రాయుడు సూచించారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.

వాలంటీర్ల వ్యవస్థ అనేదే గొప్ప ఆలోచన అని, ప్రతి మనిషికి ఏ సేవలు అవసరమో అవన్నీ వలంటీర్ల ద్వారా పక్కాగా అందుతున్నాయని చెప్పుకొచ్చారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేమని చెప్పుకొచ్చారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేదని, అలాంటిది మన రాష్ట్రంలో ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు.

Next Story