- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో క్రికెట్ సందడి: చేరుకున్న భారత్, కివీస్ జట్లు.. 28న పోరు
నగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈనెల 28న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈనెల 28న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య జట్లు బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ ముగిసే వరకు ఆటగాళ్లు అక్కడే బస చేయనున్నారు.
స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు
పీఎం పాలెంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియం ఈ కీలక పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియం సామర్థ్యం సుమారు 28,000 మంది. మ్యాచ్ రోజున స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో ప్రేక్షకులు, వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. మ్యాచ్‌తో సంబంధం లేని ప్రయాణికులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
పోలీసుల సూచనలు
ప్రేక్షకుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో రావాలని సూచించారు. మ్యాచ్ సమయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున, సాధారణ వాహనదారులు పీఎం పాలెం రోడ్డును వీలైనంత వరకు మినహాయించడం మంచిది. నగరవాసులు, క్రికెట్ అభిమానులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.






