Amaravati: అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ దృష్టి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

by Mahesh |
Amaravati: అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ దృష్టి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధానికి అమరావతికి రూ. 15 వేల కోట్లు ప్రతిపాదించింది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. చీఫ్ ఇంజినీర్లతో సాంకేతిక నిపుణుల కమిటీని సీఆర్డీఏ ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీ అమరావతిలో నిలిచిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లడంపై చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీలో పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ చైర్మన్ గా ఏడుగురితో వేశారు. కాగా మొత్తం 9 అంశాలపై చర్చించి ఈ కమిటి నివేదిక ఇవ్వనుంది. కాగా నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని సీఆర్డీఏ సదరు కమిటీకి ఆదేశించింది.

Read More..

Sangameshwara Temple:సంగమేశ్వర ఆలయాన్ని తాకిన కృష్ణమ్మ..చీర సారె సమర్పించి, మంగళ హారతి



Next Story