మీరిచ్చే గౌరవం ఇదేనా: ఏపీ ఎంపీలపై రామకృష్ణ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-18 12:41:15  IST  )

ఏపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు....

మీరిచ్చే గౌరవం ఇదేనా: ఏపీ ఎంపీలపై రామకృష్ణ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎంపీల(Ap Mps)పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI State Secretary Ramakrishna) మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Anakapalle Private Steel Plant) మూతపడుతుంటే అనకాపల్లి ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌(Anakapalle Private Steel Plant)కు గనులు కోరుతారా అంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 34 మంది బలిదానాలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. చరిత్ర మిమ్మల్ని క్షమించదని రామకృష్ణ హెచ్చరించారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో తీవ్ర నిరసనలు వెల్తువెత్తాయి. అయితే ప్రైవేటీకరణ ఉండదంటూ నాయకులు దీమాగా చెప్పారు. దీంతో ఆ అంశం పక్కకు పోయింది. తాజాగా మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని 34 విభాగాలను ప్రైవేటీకరణ చేసేందుకు యజమాన్యం నోటీఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రైవేటీకరణకు మళ్లీ అడుగులు పడటంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్పందించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story