- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI: అమిత్ షాకు మోడీ మద్దతు తెలపడం సిగ్గుచేటు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)పై సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)పై సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా(Amit Shah) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ప్రధాని మోడీ మద్దతు తెలపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
కాగా, ప్రస్తుతం అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిలతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పెండింగ్‌లో ఉందని పురందేశ్వరి కేంద్రమంత్రికి చెప్పారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఎన్టీఆర్ వర్థంతి అంశాన్ని అమిత్ షా వద్ద సీఎం ప్రస్తావించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి, అంతర్ రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అమిత్ షానే సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అమిత్ షా పాల్గొన్నారు.






