- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: సీపీఐ రామకృష్ణ
by Naga Rani Yarlagadda |
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని సీపీఐ రామకృష్ణ ఖండించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని సీపీఐ రామకృష్ణ ఖండించారు. నిన్న విశాఖలో జరిగిన రెండోరోజు సీఐఐ సదస్సులో విశాఖ ప్రైవేటీకరణ ప్రచారంపై సీఎం స్పందించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఇది తెలుగు జాతిని అవమానించడమేనని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ఆర్సిలర్ మిట్టల్ కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగరని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే.. సీఎం చంద్రబాబు చరిత్రహీనుడు అవుతాడన్నారు.
Next Story






