సినీ నటులపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సినీ నటులపై(Movie Actors) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినీ నటులపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటులపై(Movie Actors) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ‘నో డ్రగ్స్’ ప్రచార కార్యక్రమం మంచిదేనని, అయితే గుట్కా, పాన్ పరాగ్, ఖైని వంటి వాటిని నిషేధించాలన్నారు. దేశంలో రూ.10కే ప్రమాదకరమైన పాన్ మసాలాలు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పాన్ మసాలా‌లను సినీ నటుడు ప్రమోట్ చేయడం సరికాదు. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యువతను తప్పుడు దారిలో పంపే ప్రకటనల్లో సినీ నటులు పాల్గొనటం, అలా డబ్బులు సంపాదించుకోవడం బాగోలేదు. ఇకనుంచైనా అలాంటి ప్రకటనలు చేయకపోవడం మంచిది. వెంటనే పాన్ మసాలా తయారీ కేంద్రాలను సీజ్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

Next Story