CPI Narayana : జగన్ కు మామిడి రకాలైన తెలుస? : సీపీఐ నారాయణ

by Muthe.Rajitha |

మామిడి రైతులతో మాట్లాడేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాల్యం పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

CPI Narayana : జగన్ కు మామిడి రకాలైన తెలుస? : సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : మామిడి రైతులతో మాట్లాడేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాల్యం పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనపై సీపీఐ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఏం మొహం పెట్టుకొని జగన్ మామిడి రైతులను పరమర్శించడానికి వెళ్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు మామిడి పంట గురించి ఏం జ్ఞానం ఉందన్నారు.

కనీసం మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయం అయినా తెలుసా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేయలేదని, మరి ఇపుడు వారిని కలిసి ఏం చెప్పాలి అనుకుంటున్నారో జగన్ కఎ తెలియాలి అన్నారు. అధికారం పొగానే కళ్ళు నేలమీదికి రావడం అంటే ఇదేనని నారాయణ ఎద్దేవా చేశారు.

Next Story