బనకచర్లపై CM రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్ట్‌(Banakacharla Project)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ(CPI) నేత నారాయణ(Narayana) తెలిపారు.

బనకచర్లపై CM రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్ట్‌(Banakacharla Project)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ(CPI) నేత నారాయణ(Narayana) తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని.. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందేలా కృషి చేయాలని అన్నారు. ఎవరికీ నష్టం లేకుండా ప్రభుత్వాలు చూడాలని తెలిపారు. ‘‘గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో చర్చించి, ఆ తర్వాత నేనే ఒకడుగు ముందుకేసి చంద్రబాబు(Chandrababu)ను చర్చలకు ఆహ్వానిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్‌ (పీఎ్‌ఫఆర్‌) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎ్‌ఫఆర్‌ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదని, అలాగని రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story