ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే సీఎం క్యాండిడేట్ అవుతాడు.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-22 13:12:14  IST  )

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే సీఎం క్యాండిడేట్‌గా బయటకు వస్తాడు అంటూ సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోందన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే సీఎం క్యాండిడేట్ అవుతాడు.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే సీఎం క్యాండిడేట్‌గా బయటకు వస్తాడు అంటూ సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోందన్నారు. ఒక రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర రావును బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అయినా బయట అయినా ఎవరి వాదనలు వాళ్లకు ఉంటాయని, దానికి సమాధానం ఇవ్వాలని అన్నారు. ఇలా కేసులు పెట్టడం వాళ్లపై బెదిరింపులకు పాల్పడటమే అని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లను ఆపాలని చూస్తే, ప్రశ్నించేవాళ్లను ఆపాలని అనుకుంటే కాక్రోచ్ లు అన్నీ బయటకు వస్తాయని అన్నారు. కాబట్టి బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని అన్నారు. ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి, ఆయన అరెస్ట్ అవ్వాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అరెస్ట్ అయితే సీఎం క్యాండిడేట్ గా బయటకు వస్తారని, కాక్రోచ్ లు అన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతోందని కాబట్టి అరెస్ట్ చేస్తే మంచే జరుగుతుందన్నారు.

Next Story