CPI: కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారాయణ

by Disha Web Desk 16 |
CPI: కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ వ్యూహాత్మకంగానే రూ.2వేల నోట్ల చలామణిని నిలిపివేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల కోసమే బీజేపీ నోట్ల రద్దుకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. రూ.2 వేల నోట్ల రద్దు కోరుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ దేశంలో అవినీతి లేదంటూనే దేశవ్యాప్తంగా బీజేపీ హౌల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్‌ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ.2 వేల నోట్లను ఇప్పుడు కాదని, గతంలోనే రద్దు చేయాల్సి ఉందన్నారు. రూ. 500, రూ. 1000 రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్‌ మనీగా మారిందని నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో 3.4 లక్షల కోట్ల బ్లాక్‌ మనీ బయటపడుతుందని ప్రజలను నమ్మించి కేంద్రం మోసం చేసిందన్నారు. నల్లధనం బయటపడిన తర్వాత ప్రతి భారతీయుడు అకౌంట్‌లో రూ.15 లక్షలు జమ చేస్తామని నాడు ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇవ్వలేదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నోట్లు రద్దు అయి ఏళ్లు గడిచిపోయాయని కానీ ఇప్పటికీ కూడా ఒకరి అకౌంట్లో కూడా పైసా జమకాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు.

Also Read..

ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి: CPI


Next Story