COVID-19 : కోవిద్-19 వ్యాప్తి.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Carona Cases) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

COVID-19 : కోవిద్-19 వ్యాప్తి.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Carona Cases) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా గుమిగూడ కూడదని, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని పబ్లిక్ స్థలాల్లో కోవిద్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని.. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఎవరకైనా కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లో ఉండాలని.. వైద్యుల సలహాతో మందులు వాడాలని తెలియజేసింది.

Next Story