- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై.. జైలు శిక్ష విధించిన కోర్టు
యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అన్నిరకాలుగా వాడుకుని మోసం చేసిన ఎస్సైకి గుంటూరు జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అన్నిరకాలుగా వాడుకుని మోసం చేసిన ఎస్సైకి గుంటూరు జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితుడు, ప్రస్తుతం అమృతలూరు ఎస్సైగా పనిచేస్తున్న రవితేజకు 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు తీర్పు వెల్లడించింది. 2023లో నగరంపాలెం ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో రవితేజపై ఓ యువతి ఈ ఆరోపణలు చేసింది.
2023 మే నెలలో.. జీజీహెచ్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న యువతి.. నగరంపాలెం ఎస్సైగా పనిచేస్తున్న రవితేజ తనను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి ఐద్వా ప్రతినిధులను ఆశ్రయించింది. ప్రేమపేరుతో అన్నిరకాలుగా వాడుకున్నాక.. పెళ్లిచేసుకోమంటే మొఖం చాటేస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీకి స్పందనలో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత అతని నుంచి బెదిరింపులు రావడంతో తాడేపల్లి ఐద్వా ప్రతినిధులను ఆశ్రయించింది.






