Terrorist Attack : ఉగ్రదాడి అనుమానితులపై కోర్ట్ తీర్పు రిజర్వ్

by Muthe.Rajitha |

ఉగ్రవాద కార్యకలాపాలకు(Terrorist Activities) సంబంధించిన కేసులో అనుమానితులైన సిరాజ్(Siraj), సమీర్(Samir) లపై తీర్పును నేడు విజయవాడ జిల్లా కోర్టు(Vijayawada District Court) రిజర్వ్ చేసింది.

Terrorist Attack : ఉగ్రదాడి అనుమానితులపై కోర్ట్ తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉగ్రవాద కార్యకలాపాలకు(Terrorist Activities) సంబంధించిన కేసులో అనుమానితులైన సిరాజ్(Siraj), సమీర్(Samir) లపై తీర్పును నేడు విజయవాడ జిల్లా కోర్టు(Vijayawada District Court) రిజర్వ్ చేసింది. వీరి ఇద్దరిని ఏపీ, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. వీరు విజయనగరం, హైదరాబాద్‌ తో సహ దేశంలోని వివిధ నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయనగరంలో సిరాజ్ నివాసంలో అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సమీర్‌ను హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయనగరం తీసుకొచ్చారు.

ప్రాథమిక విచారణలో సిరాజ్ ఇస్లామిక్ స్టేట్(ISIS) మాడ్యూల్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు, సౌదీ అరేబియాలోని అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AHIM) నుంచి సూచనలు అందుకున్నట్లు తేలింది. వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌదీ ఆధారిత హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి బాంబు తయారీపై అధ్యయనం చేశారని నిర్దారించారు. సిరాజ్ రాంపచోడవరంలో ఒక చిన్న ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్(IED)ని పరీక్షించినట్లు కూడా గుర్తించారు. ఈ ఇద్దరూ AHIM ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసి, 28 మందిని రాడికలైజ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

విజయవాడ జిల్లా కోర్టు ఈ కేసును విచారించి భారతీయ న్యాయ స్మృతి (BNS)లోని ఉగ్రవాద కార్యకలాపాలు, ప్రజా శాంతిని భంగపరిచే చర్యలకు సంబంధించిన సెక్షన్ల కింద ఆరోపణలు నమోదు చేసింది. విజయనగరం టౌన్-II పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరిచి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. వీరి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించి, NIA కోర్టును సంప్రదించాలని ఆదేశించింది. విజయవాడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో.. NIA అధికారులు విశాఖకు చేరుకొని, సిరాజ్, సమీర్‌ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story