అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కోర్టు కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Ananthababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subramaniam Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కోర్టు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Ananthababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subramaniam Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతినిచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2022 మే 19న రాత్రి కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కాగా, ఆ డెడ్ బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించగా.. మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు విచారణ గత ప్రభుత్వం హయాంలో సరిగా జరగలేదని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించగా.. పోలీసులు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Next Story