- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడియం హత్యాచారం కేసులో సంచలన తీర్పు
ఏడాదిన్నర క్రితం కడియం మండలంలో హత్యాచారం కేసులో నలుగురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: సుమారు ఏడాదిన్నర క్రితం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో ఓ మహిళపై జరిగిన హత్యాచారం కేసులో నేడు తీర్పు వెల్లడైంది. మహిళపై సామూహిక హత్యాచారానికి పాల్పడిన నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్ 15న నర్సరీలో పనిచేసి ఇంటికి వెళ్తున్న ఒడిశాకు చెందిన 43 ఏళ్ల మహిళపై నలుగురు మృగాళ్లు కన్నేశారు. ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి హత్యచేసిన ఉదంతం నవంబర్ 2న బయటపడింది. నిందితులన బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22)లుగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. ఎప్పుడూ మద్యం, గంజాయి మద్యంలో ఉండే నిందితులు.. పథకం ప్రకారమే మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మృతురాలికి భర్త, కొడుకు, స్పెషల్లీ డిజార్డర్డ్ కుమార్తె ఉన్నారు.






