- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ నేత భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి అనుమతి
వైసీపీ నేత, ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డిని 2 రోజలు పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత(Ycp Leader), ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డి(Malapati Bharskar Reddy)ని 2 రోజలు పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో నెల్లూరు జిల్లాల్లో ఆయన్ను పోలీసుల ప్రశ్నించనున్నారు. సీఎం చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో పాటు టీడీపీ(Tdp), జనసేన(Janasena) పార్టీ మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పెట్టిన కేసులో మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే రిమాండ్ తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసులో మరింత విచారించాలనే కోణంలో పోలీసులు కోర్టుకు అభ్యర్థించారు. దీంతో కోర్టు అనుమతించింది. రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటూ మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణించడంతో సొంతూరుకు వచ్చాడు. దీంతో ఆయనపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశార. ఈ మేరకు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ నెల 21 వరకు రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్ గడువు ముగియడంతో భాస్కర్ రెడ్డికి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో మరింత విచారించేందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరడంతో రెండు రోజుల పాటు అనుమతించింది.






