తిరుమల గెస్ట్​హౌస్​లో దంపతుల ఆత్మహత్య

by Thanuru Gopichand |

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపైన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.

తిరుమల గెస్ట్​హౌస్​లో దంపతుల ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపైన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. తిరుమలలోని నందకం అతిథి గృహంలోని 203 రూంలో తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన భర్త శ్రీనివాసులు నాయుడు, భార్య అరుణ లు చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రూమ్ తీసుకొన్న వీరు ఉదయం నుంచి రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది అనుమానంతో కిటికీలు తెరిచి చూడగా వారు ఫ్యాన్ కు వేలాడుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story