అమెరికాలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-05 05:52:18  IST  )

అమెరికాలో వరుసగా ప్రాణాలు కోల్పోతున్న తెలుగువారు.

అమెరికాలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల అమెరికాలో (America) చోటు చేసుకుంటున్న తెలుగువారి మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని మేరీ ల్యాండ్ లో (Mary Land) నిఖిత గోడిశాల అనే యువతి హత్యకు గురైన విషయం మరువక ముందే మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగువారైన దంపతులు మరణించిన వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. గతవారం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘనారాణి, కడియాల భావన అనే యువతులు కూడా గత వారం అలబామా హిల్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు.

ఈ క్రమంలో పాలకొల్లుకు చెందిన దంపతులు కొటికలపూడి కృష్ణ కిషోర్ (45), ఆశ కన్నా (40) వాషింగ్టన్ లో (Washington) రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యారు. వారి కారు ప్రమాదానికి గురవ్వడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో గాయపడిన వారి కుమారుడు, కుమార్తెను అక్కడి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కృష్ణ కిశోర్ గత పది సంవత్సరాలకు పైగానే అమెరికాలో పని చేస్తున్నారు. గత పది రోజుల క్రితం పాలకొల్లు వచ్చి వెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ దుర్ఘటనల పట్ల అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో ఆందోళన నెలకొంది.

Next Story