రేపు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

by Thanuru Gopichand |   (  Updated:2025-08-13 10:35:33  IST  )

నిన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.

రేపు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : నిన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. కడప పాలిటెక్నిక్​కళాశలలో కౌంటింగ్​జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్​కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్​లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే విధంగా ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు రౌండ్లలో కౌంటింగ్​జరుగుతుంది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశా రు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నిన్నటి ఎన్నికల్లో ఒంటిమిట్టలో 84.05 శాతం, పులివెందులలో 76.44 శాతం పోలింగ్‌ జరిగింది. అయితే ఇక్కడ భారీ రిగ్గింగ్​జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు పారద్శకంగా జరిగాయని టీడీపీ చెబుతోంది.

Next Story