AP DSC : ఏపీ డీఎస్సీకి కౌంట్ డౌన్.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

by Thanuru Gopichand |   (  Updated:2025-05-13 07:38:00  IST  )

ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తు కడుగు మరో రెండు రోజులు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.

AP DSC : ఏపీ డీఎస్సీకి కౌంట్ డౌన్.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు
X

రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

ఇప్పటి వరకు 3,03,527 దరఖాస్తులు

షెడ్యూలు ప్రకారమే పరీక్షలు

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించి దరఖాస్తు కడుగు మరో రెండు రోజులు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.ఇప్పటి వరకు 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కూటమి ప్రభుత్వం గత నెల 20న మెగా డీఎస్సీ నోటిఫికేషనన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వయోపరిమితి పెంచాలని, పరీక్ష సిద్ధపాటుకు 90 రోజులు గడువు ఇవ్వాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

అయితే ఇంతవరకు ప్రభుత్వం ఇటువంటి డిమాండ్లపై స్పందించడం లేదు. పరీక్ష యధావిధిగా జరుగుతుందని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే దరఖాస్తు గడువు ముగిసిపోతుందని.. చివరి వరకు అభ్యర్థులు వేచి చూడవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ రిక్రూట్మెంట్ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. న్యాయపరమైన అన్ని అడ్డంకులను తొలగించుకుని గత నెలలో డిఎస్సీ ప్రకటించారు. అంతకు ముందు నుంచే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 2018 తరువాత జరుగుతున్న డిఎస్సీ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించి నట్లుగానే 16,000 పై చిలుకు ఉద్యోగాలతో డీఎస్సీ ని ప్రకటించింది. ప్రభుత్వమే అనేక చోట్ల ఉచిత శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ డీఎస్సీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎ టువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా డీఎస్సీ ప్రక్రియ కొనసాగిస్తామని ఆయన చెప్పినట్లుగానే పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story