PSLV -C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

by Thanuru Gopichand |

మరో ప్రతిష్టాత్మక ఘట్టానికి సర్వం సన్నద్ధం.

PSLV -C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 22 గంటల పాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్ అనంతరం, సోమవారం ఉదయం 10:17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా స్వదేశానికి చెందిన 7 మైక్రో ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన 8 మైక్రో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రధానంగా రక్షణ పరిశోధన సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 'ఈవోఎస్-ఎన్1' (EOS-N1/Anvesha) అనే అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం ఉండటం విశేషం. ఇది భూమిపై పర్యావరణ మార్పులు, వ్యవసాయం, వ్యూహాత్మక నిఘా కోసం కీలక సమాచారాన్ని అందించనుంది. 2026 సంవత్సరంలో ఇస్రో చేపడుతున్న మొదటి ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

Next Story