రూ.140 కోట్ల విలువైన పత్తి బేళ్లు మాయం.. సీఐడీ విచారణ షూరూ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-02 08:08:04  IST  )

గుంటూరు సీసీఐలో కోట్ల విలువైన పత్తి బేళ్లు మాయం అయ్యాయి...

రూ.140 కోట్ల విలువైన పత్తి బేళ్లు మాయం.. సీఐడీ విచారణ షూరూ
X

దిశ, వెబ్ డెస్క్: రూ. 140 కోట్ల విలువైన పత్తి బేళ్లు మాయం అయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన గుంటూరులో సంచలనంగా మారింది. గత ఏడాది రైతులు పండించిన పత్తిని సీసీఐలో నిల్వ చేశారు. మొత్తం 3 లక్షల 75 వేల పత్తి బేళ్లలో 40 వేలు బేళ్లు కనిపించకుండా పోయాయి. దీంతో సీఐడీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు సీఐడీ డీఎస్పీ సునీల్ అధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సీసీఐ మేనేజర్ రాజేంద్ర షాను విచారిస్తున్నారు. గత ఏడాది జరిగిన పత్తి కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రశ్నిస్తున్నారు.

అయితే 40 వేల బేళ్లను అక్రమంగా బయ్యర్లు అమ్ముకున్నట్లు ప్రచారం జరిగింది. ఒక్కో బేళ్లను రూ. 25 వేలు నుంచి 28 వేల వరకు అమ్ముకున్నారని ఆరోపణలు అప్పట్లో కలకలం రేగాయి. ఇలా రూ. 140 కోట్ల విలువైన పత్తి బేళ్లను కనిపించకుండా చేశారని ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు గుంటూరు సీసీఐలో విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story