మహింద్రా థార్, రాయల్ ఎన్‌ఫీల్డ్.. కోడిపందాల్లో కళ్లు చెదిరే బహుమతులు

by Ajay Maddhiboyina |

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. పందెం వీరులు బరిలోకి దిగి వేలు, లక్షల్లో డబ్బులు జల్లుతున్నారు. పందాల్లో కేవలం పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొంటూ పందెం కాస్తున్నారు.

మహింద్రా థార్, రాయల్ ఎన్‌ఫీల్డ్.. కోడిపందాల్లో కళ్లు చెదిరే బహుమతులు
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. పందెం వీరులు బరిలోకి దిగి వేలు, లక్షల్లో డబ్బులు జల్లుతున్నారు. పందాల్లో కేవలం పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొంటూ పందెం కాస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం ప్రజలు విచ్చేస్తున్నారు. అయితే కోళ్ల పందాలు అంటే జూదం అవుతుంది. దీంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాళ్ల‌పూడి మండ‌లంలో కోడిపందాల‌ను టోర్న‌మెంట్ మాదిరిగా నిర్వ‌హిస్తున్నారు. నిర్వ‌హాకులు బెట్టింగ్ వేయ‌కుండా పందెంలో గెలిచిన‌వారికి ఖ‌రీదైన బ‌హుమ‌తులు ఆఫ‌ర్ చేశారు. మూడు రోజులు పందెం నిర్వ‌హిస్తుండ‌గా చివ‌రి రోజు విజేత‌కు మ‌హీంద్రా థార్ వాహ‌నం బ‌హుమ‌తిగా ఇస్తున్నారు. అంతేకాకుండా రెండో రోజు విజేత‌కు రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైక్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. జూదంలా కాకుండా ఒక టోర్నీగా కోడి పందాలను నిర్వ‌హించడానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు నిర్వాహ‌కులు చెబుతున్నారు. దీనివ‌ల్ల ఎవ‌రూ న‌ష్ట‌పోకుండా ఉంటార‌ని అంటున్నారు.

Next Story