మండుటెండల నుంచి ఉపశమనం.. నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో భిన్న వాతావరణం కనిపించింది.

మండుటెండల నుంచి ఉపశమనం.. నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో భిన్న వాతావరణం కనిపించింది. మండుటెండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ఏపీ వాసులకు వాతావరణశాఖ కూల్ న్యూస్ (AP Weather Update) చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.

మంగళవారం అర్థరాత్రి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. బుధవారం ఉదయం కూడా గుంటూరు, విజయవాడ, కోనసీమ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది.

వైజాగ్ లో మొన్నటి వరకూ 40 డిగ్రీల వరకూ నమోదైన ఉష్ణోగ్రతలు.. మంగళవారం 28 డిగ్రీలకు పడిపోయాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అరకు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు మండుటెండల నుంచి ఉపశమనం లభించినట్లయింది.

Next Story