- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టులకు సహకరించండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు.

కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
తొలుత ప్రహ్లాద్ జోషి తో సమావేశం
రూఫ్‌టాప్ సోలార్ కేటాయించాలని కోరిన సీఎం
అనంతరం కేంద్ర రక్షణశాఖ మంత్రితో భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు.ఈ రోజు ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. ఏడుగురు కేంద్రమంత్రులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. ఉదయం పది గంలలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో (Prahlad Joshi) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో, పీఎం సూర్య గర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపును కోరినట్లు సీఎం ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టే గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారం అందిచాలని ఆయన కోరారు. అనంతరం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖమంత్రితో బీఈఎల్డిఫెన్స్కాంప్లెక్స్, హెఏఎల్.. ఏఎంసీఏ ప్రోగ్రాంతో సహా ఏపీ వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
మధ్యాహ్నం తర్వాత వరుసగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణ పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్రమంత్రితో చర్చిం చనున్నారు. నిర్మలా సీతారామన్ తో భేటీ అయి ఏపీ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే సమీక్షకు సీఎం హాజరు కానున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఏపీ పాత్రపై చర్చిం చనున్నారు. రేపు సీఎం చంద్రబాబు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారు.






