Tirumala News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(గురువారం) శ్రీవారిని 66,530 మంది దర్శించుకున్నారు. 32,478మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.66 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story