AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు

by Indraja |

వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీ గూటికి చేరుతున్నారు.

AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు
X

దిశ, పుట్టపర్తి: వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పుట్టపర్తి రూరల్ మండలం కంబాలపర్తి ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద అంజనప్ప, అతని కుమారుడు వాలంటీర్ కిరణ్, కోడలు మమత,కుమార్తె భారతి కుటుంబం మొత్తం వైసీపీని వీడి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు తమకు నచ్చాయని వెల్లడించారు. ఇక పల్లె రఘునాథ్ రెడ్డి తమకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో టిడిపిలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఫ్యాన్ గాలి తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Next Story