- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజపతినగరంలో కంటైనర్ లారీ బీభత్సం
విజయనగరం జిల్లా గజపతినగరంలో (Gajapati Nagaram) భారీ ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా గజపతినగరంలో (Gajapati Nagaram) భారీ ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఒక కంటైనర్ లారీ డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపడంతో, అది అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నివాసాల వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉంచిన ఒక కారుపైకి లారీ ఎక్కి దూసుకెళ్లడంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. లారీ వేగానికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కంటైనర్ దూసుకురావడంతో స్థానికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ప్రమాదం (Road Accident) జరిగిన సమయంలో కారులో కానీ, లారీ దూసుకెళ్లిన ప్రాంతంలో కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ మద్యం సేవించి ఉండటమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఇంతటి బీభత్సం జరిగిందని, ఒకవేళ జనసమ్మర్థం ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నుజ్జునుజ్జైన కారును చూసి వాహనదారులు, గ్రామస్తులు విస్మయానికి గురయ్యారు. ఏది ఏమైనా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






