ఎండల ఉగ్రరూపం: ఒకే రోజు 10 మందికి వడదెబ్బ.. ఒకరి మృతి

by Vemula.Srinu Prasad |

రాజధాని అమరావతి పరిధిలో ఎండలు మండుతుండటంతో నిర్మాణ కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక్కరోజే 10 మంది కార్మికులు వడదెబ్బతో రావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది....

ఎండల ఉగ్రరూపం: ఒకే రోజు 10 మందికి వడదెబ్బ.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati) పరిధిలో ఎండలు మండుతుండటంతో నిర్మాణ కార్మికులు(Construction workers) వడదెబ్బ(Sunburn) బారిన పడుతున్నారు. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) ఒక్కరోజే 10 మంది కార్మికులు వడదెబ్బతో రావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆసుపత్రిలో తగినన్ని బెడ్లు సరిపోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న వసతులతోనే వైద్యులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే బెడ్‌పై ఇద్దరు చొప్పున కూర్చోబెట్టి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఉద్దండరాయునిపాలెంలో వెంకటేశ్వర నాయక్ మృతి

తీవ్రమైన ఎండల కారణంగా ఉద్దండరాయునిపాలెంలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పని చేస్తున్న వెంకటేశ్వర నాయక్ అనే నిర్మాణ కార్మికుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన తోటి కార్మికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజధాని ప్రాంతంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా వారికి అవసరమైన నీడ, మజ్జిగ, ఓఆర్‌ఎస్ (ORS) లభ్యతను పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story