Viral News: పవన్ కళ్యాణ్ ను కదిలించిన ఫొటో.. వెంటనే కీలక నిర్ణయం

by Vennela |   ( Updated:2025-04-15 08:13:25.0  )
Viral News: పవన్ కళ్యాణ్ ను కదిలించిన ఫొటో.. వెంటనే కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: Viral News: భారతదేశ గ్రామాల్లో వ్యవసాయ ఆదాయంతోపాటు పాడి పరిశ్రమ కీలక ఆర్థికవనరుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రైతులు తమ పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీరు, గడ్డి అందించడంలో ప్రస్తుత కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగానే పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు, ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను నివారించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా దాదాపు రూ. 60 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతోంది. ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.

పశుపోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమం సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అత్యుత్తమమైన కృషి చేస్తూ ఇందులో భాగస్వాములైన ఉపాధి హామీ కార్మికులకు క్షేత్ర స్థాయి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ చొరవను.. నెటిజన్లను ప్రశంసిస్తున్నారు.


Also Read..

AP Deputy CM:పవన్ కళ్యా‌ణ్‌కు మరోసారి అస్వస్థత?

Next Story

Most Viewed