- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుడికి గుండెపోటు: రక్షించిన కానిస్టేబుల్
by Vemula.Srinu Prasad |
తిరుమలలో గుండెపోటు వచ్చిన భక్తుడిని కానిస్టేబుల్ రక్షించారు..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ మానవత్వం చాటారు. కుప్పకూలిపోయిన భక్తుడి(Devotee)కి సీపీఆర్(Cpr) చేశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భక్తుడికి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.
అయితే భక్తుడికి గుండెపోటు(Heart Attack) వచ్చిన నేపథ్యంలో సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసిన కానిస్టేబుల్ గురప్పపై ప్రశంసలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసులకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం లడ్డూ కౌంటర్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ గురప్ప వెంటనే సీపీఆర్ చేశారు.
Next Story






